ఆస్కార్‌కు నామినేట్ అయిన రోమా, ది ఫేవరేట్

Wed,January 23, 2019 12:38 AM

Oscars 2019 The Favourite and Roma lead nominations

-భారత్ నుంచి ఎంపికైన లఘు చిత్రం పీరియడ్
లాస్ ఏంజిల్స్: ఆస్కార్ అవార్డుల సందడి మొదలైంది. ప్రతిష్టాత్మక 91వ అకాడమీ అవార్డుల బరిలో దిగిన చిత్రాల వివరాలను అవార్డుల కమిటీ మంగళవారం వెల్లడించింది. రోమా, ది ఫేవరెట్ చిత్రాలు అత్యధికంగా పది విభాగాల్లో నామినేషన్లు దక్కించుకున్నాయి. ఏ స్టార్ ఇజ్ బార్న్, వైస్ సినిమాలు ఎనిమిది విభాగాల్లో, బ్లాక్ పాంథర్ ఏడు విభాగాల్లో ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి. ఇక భారత్ నుంచి లఘు చిత్రం పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్ లఘు అంశాల డాక్యుమెంటరీ విభాగంలో నామినేట్ అయింది. స్త్రీ రుతుక్రమంపై గ్రామీణ భారతం నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రానికి రేకా జెహతబ్చీ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 24న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 91వ అకాడమీ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

497
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles