పాక్ ప్రధానికి తప్పిన పదవీగండం


Fri,April 21, 2017 02:37 AM

nawaz
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్‌షరీఫ్ తృటిలో పదవీగండం నుంచి తప్పించుకున్నారు. ఆయన కుటుంబంపై నమోదైన అక్రమాస్తుల కేసుపై పాక్ సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. ఇద్దరు న్యాయమూర్తులు నవాజ్ షరీఫ్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రతిపాదించగా, ముగ్గురు న్యాయమూర్తులు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. దీంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. గత ఏడాది లీకైన పనామా పత్రాల్లో నవాజ్ షరీఫ్ 1990లోప్రధానిగా పనిచేసినప్పుడు లండన్‌లో ఆస్తులు కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయి.దీనిపై పాకిస్థాన్ తెహ్రిక్‌ఐ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

483

data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS

Union Budget 2018