చైనా, బంగ్లాదేశ్ కార్మికుల మధ్య ఘర్షణ

Thu,June 20, 2019 01:04 AM

One Chinese worker killed in Bangladesh construction site clash

ఒక చైనీయుడు మృతిఢాకాలో ఘటన

ఢాకా: బంగ్లాదేశ్‌లో స్థానికులకు, చైనీయులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక చైనీయుడు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో చైనా నిధులతో ఓ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడ పనిచేస్తున్న వారిలో బంగ్లాదేశ్‌కు చెందిన ఒక కార్మికుడు మరణించారు. ఈ ఘటన గురించి బయటికి తెలువకుండా చైనా కార్మికులు కప్పిపుచ్చుతున్నారని ఆరోపిస్తూ బంగ్లాదేశ్ కార్మికులు గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగగా 12 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురు చైనీయులు. వీరిని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ఓ కార్మికుడు మరణించాడు.

303
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles