కయ్యానికి కాలుదువ్వుతున్న ట్రంప్


Fri,October 13, 2017 10:10 AM

- ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి ఆరోపణ
- చేయాల్సింది చేస్తామన్న ట్రంప్
trump
మాస్కో/వాషింగ్టన్ : గత నెలలో ఐక్యరాజ్యసమితిలో తమకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు యుద్ధాన్ని ప్రేరేపించాయని ఉత్తర కొరియా విదేశాంగశాఖ మంత్రి రియాంగ్ హో ఆరోపించారు. ట్రంప్ ప్రసంగం కయ్యానికి కాలు దువ్వేలా ఉన్నదని రష్యా అధికార వార్తా సంస్థ టాస్‌కు బుధవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ప్రపంచం ముందు అవమానానికి గురి కావద్దని కోరుకుంటే అమెరికా తన పద్ధతి మార్చుకోవాలి. మాపై దాడులు చేయడానికి బదులు ఆమోదయోగ్యంగా వ్యవహరించాలని మా అధినేత కిమ్ కఠినంగా హెచ్చరించారు అని రియాంగ్‌హో చెప్పారు. తమ వద్ద ఉన్న అణ్వస్ర్తాలను న్యాయ కరవాలంగా అని అభివర్ణించారు. మరోవైపు సమస్య తీవ్రమైన తర్వాత తాము చేయాల్సింది తాము చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

1382

More News

VIRAL NEWS