చైనాలో ఉత్తరకొరియా అధినేత కిమ్

Wed,January 9, 2019 12:34 AM

North Koreas Kim in China

బీజింగ్, జనవరి 8: ఉత్తరకొరియా అధినేత కిమ్‌జోంగ్ ఉన్ తన సతీమణితో కలిసి మంగళవారం చైనాకు వచ్చారు. కొరియా ద్వీపకల్పాన్ని నిరాయుధీకరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కిమ్ మలివిడుత చర్చలు జరుగనున్నాయన్న వార్తల నేపథ్యంలో చైనాలో కిమ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది. అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు కిమ్ ఈ నెల 7-10 మధ్య చైనా పర్యటనకు వచ్చారని అధికార వార్తాసంస్థ జిన్హువా పేర్కొంది.

592
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles