అడవిలో తప్పిపోయిన బాలిక

Mon,August 12, 2019 01:23 AM

Nora Quoirin missing Malaysia police scale back jungle search

-300 మంది సిబ్బంది గాలింపు
-హెలికాఫ్టర్లు, జాగిలాలు, డ్రోన్‌లు కూడా..
-మలేషియాలో ఘటన

సెరెంబన్‌ (మలేషియా), ఆగస్టు 11: మలేషియా విహారయాత్రకు ఫ్యామిలీతో కలిసి వెళ్లిన పదిహేనేండ్ల యూరోపియన్‌ బాలిక అక్కడి దట్టమైన అడవుల్లో అదృశ్యమైపోవడం మిస్టరీగా మారింది. బాలిక పేరు నోరా ఖ్వోరిన్‌. ఆమె కుటుంబం విహారయాత్రలో భాగంగా మలేషియాలోని సెరెంబన్‌ సమీపాన ఉన్న డసన్‌ రిసార్టులో బస చేసింది. ఆగస్టు 4 ఆదివారం ఉదయం తల్లిదండ్రులు నిద్రలేచి చూడగా పడకగదిలో నోరా కనిపించలేదు. గది కిటికి తెరిచి ఉంది. మలేషియా పోలీసులకు వారు ఫిర్యాదుచేయడంతో అదృశ్యం కేసుగా నమోదు చేశారు. బాలిక ఆచూకీ కోసం 300 మంది గాలింపు చర్యలు చేపట్టారు. హెలికాఫ్టర్లు, పోలీసు జాగిలాలు, డ్రోన్‌ల సాయంతో అడవిని జల్లెడ పడుతున్నారు.

768
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles