ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ రాజీనామా

Wed,October 10, 2018 01:29 AM

Nikki Haley US ambassador to UN resigns

2020 ఎన్నికల్లో ట్రంప్‌కు ప్రత్యర్థిని కానని వెల్లడి
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా ఉన్న నిక్కీ హేలీ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను వెంటనే ఆమోదించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఐరాసలో అమెరికా రాయబారిగా ఆమె అసమాన సేవలందించారని కొనియాడారు. ఈ ఏడాది చివరి వరకు పదవిలో కొనసాగాలని అనుకుంటున్నట్టు హేలీ ప్రకటించినా, ట్రంప్ హడావిడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆమె రాజీనామాను ఆమోదిస్తున్నట్టు వెల్లడించారు. అయితే నిక్కీ హేలీ రాజీనామాకు గల కారణాలు వెల్లడి కాలేదు. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌కు ప్రత్యామ్నాయమని భావిస్తున్న నిక్కీ హేలీ.. 2020లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. ట్రంప్‌కు మద్దతుగానే ప్రచారం చేస్తానన్నారు.

446
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles