పెట్రోల్ ట్యాంకర్ పేలి 20 మంది మృతి!

Sun,January 13, 2019 12:29 AM

Nigeria tanker blast Eight dead 20 severely burnt in state capital

-నైజీరియాలో దుర్ఘటన
వర్రి(నైజీరియా), జనవరి 12: నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలడంతో పలువురు మరణించారు. శుక్రవారం సాయంత్రం ఒడుక్‌పాని ప్రాంతంలో పెట్రోల్ ట్యాంకర్ ఒక్కసారిగా ఒరిగిపోవడంతో స్థానిక ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా లీకవుతున్న పెట్రోల్‌ను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా పేలుడు సంభవించింది. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మాట్లాడుతూ లీక్ అవుతున్న పెట్రోల్‌ను స్థానికులు డబ్బాల్లోకి నింపుతుండగా మంటలు చెలరేగి పేలుడు సంభవించిందని చెప్పారు. దుర్ఘటనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఇప్పుడే చెప్పలేమని, కాకపోతే మృతుల సంఖ్య భారీగానే ఉండొచ్చని తెలిపారు. కాలిన గాయాలతో ఉన్నవారిని సమీప దవాఖానకు తరలించామని పేర్కొన్నారు. స్థానికుడు ఒకరు మాట్లాడుతూ తాను మృతదేహాలను లెక్కించానని, 18 మంది మరణించారని తెలిపారు. మరో స్థానికుడు స్పందిస్తూ ప్రమాద స్థలం నుంచి 20కిపైగా మృతదేహాలను తరలించారని వివరించారు. కాగా, నైజీరియాలో రోడ్లు సరిగా లేకపోవడంతో తరుచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.

288
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles