మనవాళ్లు ఎవరో చెప్పేస్తుంది!


Mon,December 4, 2017 02:50 AM

వందల డీఎన్‌ఏలను పోల్చే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు
SCIENCE-GENOME
న్యూయార్క్, డిసెంబర్ 3: ఒక వ్యక్తి డీఎన్‌ఏ పరీక్ష ఫలితం రావాలంటే దాదాపు ఐదు రోజుల సమయం పడుతుంది. ఆ డీఎన్‌ఏను ఇతర డీఎన్‌ఏలతో పోల్చి చూడడానికి ఏకంగా వారాల సమయం పడుతుంది. ఈ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తూ.. విభిన్న డీఎన్‌ఏలను పరిశీలించి జన్యుక్రమం సమానంగా ఉన్నవాటిని నిమిషాల్లో గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది క్యాన్సర్ చికిత్స, కణజాలం, అవయవ మార్పిడి చికిత్సకు సహాయపడుతుందని చెప్తున్నారు. క్యాన్సర్‌కు మెరుగైన చికిత్స అందుబాటులోకి తేవడంలో కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా వీరు మిన్‌అయాన్ అనే పరికరాన్ని రూపొందించారు. ఏటీఎం కార్డు పరిమాణంలో ఉండే ఈ పరికరం డీఎన్‌ఏలోని జన్యుక్రమాన్ని విశ్లేషిస్తుంది. దానిని కంప్యూటర్‌కు అనుసంధానించినప్పుడు అప్పటికే డేటాబ్యాంక్‌లో నిల్వచేసి ఉన్న డీఎన్‌ఏ రిపోర్టులతో సరిపోల్చుతుంది. దాదాపు సమానంగా ఉన్న డీఎన్‌ఏలను గుర్తించి నివేదిక ఇస్తుంది. తమ సాఫ్ట్‌వేర్ ఒక వ్యక్తి డీఎన్‌ఏను దాదాపు 300 డీఎన్‌ఏలతో సరిపోల్చగలదని, నిమిషాల్లో ఫలితాన్ని ఇస్తుందని కొలంబియా శాస్త్రవేత్తల బృందం చెప్తున్నది.

571

More News

VIRAL NEWS