ఎవరెస్ట్ అధిరోహణలో నేపాల్‌వాసి ప్రపంచ రికార్డు!

Thu,May 16, 2019 01:20 AM

Nepal Mountaineer 49 Conquers Mount Everest For Record 23rd Time

- 23 సార్లు ఎవరెస్ట్‌ను ఎక్కిన మొదటి వ్యక్తిగా కామి రీటా షెర్పా

ఖాట్మండు, మే 15: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంలో నేపాల్‌కు చెందిన పర్వతారోహకుడు కామి రీటా షెర్పా కొత్త రికార్డును సృష్టించాడు. అత్యధికసార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన పర్వతారోహకుడిగా ఆయన తన రికార్డును తానే బద్దలు కొట్టినట్టు బుధవారం హిమాలయన్ టైమ్స్ పేర్కొంది. ఎవరెస్ట్‌ను అతను 23 సార్లు ఎక్కి ఈ ఘనత సాధించాడు. 49 ఏండ్ల వయసున్న కామి రీటా నేపాల్ వైపు నుంచి బుధవారం ఉదయం 8,850 మీటర్ల ఎత్తు గల ఎవరెస్ట్‌ను మరికొంత మందితో కలిసి ఎక్కాడు. 1994లో కామి రీటా మొదటిసారిగా ఎవరెస్ట్‌ను అధిరోహించాడు. 2017లో కామి రీటా ఎవరెస్ట్‌ను ఎక్కి.. ఎవరెస్ట్ శిఖరాన్ని 21 సార్లు అధిరోహించిన అపా షెర్పా, ఫుర్బా తాశి షెర్పా సరసన చేరారు. 2018లో కామి రీటా మరోమారు ఎవరెస్ట్‌ను ఎక్కి ప్రపంచంలోనే అత్యధికసార్లు ఎవరెస్ట్‌ను ఎక్కిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు.

459
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles