భారత కరెన్సీపై నేపాల్‌లో నిషేధం

Tue,January 22, 2019 12:12 AM

Nepal bans Indian currency notes above Rs 100

కఠ్మాండు, జనవరి 21: నేపాల్‌లో భారత కరెన్సీ నోట్లు రూ.200, 500, 2000పై ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ నిషేధం విధించింది. దీంతో భారత పర్యాటకులకు నేపాల్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. నేపాల్‌లో భారత కరెన్సీ చెల్లుబాటవుతుందన్న సంగతి తెలిసిందే. అయితే రూ.100 కన్నా అధిక విలువ ఉన్న భారత కరెన్సీని నేపాలీ పర్యాటకులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఉపయోగించరాదని సెంట్రల్ బ్యాంక్ ఆదివారం జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. నేపాల్ పౌరులు ఆ కరెన్సీ నోట్లను భారత్‌కు తప్ప ఇతర దేశాలకు కూడా తీసుకెళ్లరాదని తెలిపింది. అయితే రూ.100 కన్నా తక్కువ విలువన్న భారత కరెన్సీ నేపాల్‌లో చెల్లుబాటవుతుందని పేర్కొంది.

468
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles