పెరోల్‌పై విడుదలైన నవాజ్ షరీఫ్

Thu,September 13, 2018 12:25 AM

Nawaz Sharif Maryam Nawaz released on parole to attend funeral of Kulsoom Nawaz

-రేపు ఆయన భార్య అంత్యక్రియలు
లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మర్యమ్, అల్లుడు సఫ్దర్ పెరోల్‌పై విడుదలయ్యారు. షరీఫ్ భార్య బేగం కుల్సుమ్(68) మంగళవారం లండన్‌లో మృతిచెందడంతో ఆమె అంత్యక్రియలకు హాజరుకావడానికి పెరోల్ మంజూరు చేయాలని షరీఫ్ సోదరుడు షహబాజ్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం మూడు రోజుల పెరోల్‌ను మంజూరు చేసిం ది. తర్వాత వారిని ప్రత్యేక విమానంలో లాహోర్‌కు తరలించారు. మరోవైపు కుల్సుమ్ మృతదేహాన్ని స్వదేశానికి తేవడానికి షరీఫ్ సోదరుడు షహబాజ్ లండన్‌కు వెళ్లారు. ఆమె అంత్యక్రియలు శుక్రవారం జరుగనున్నాయి.

391
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles