మంచు మనిషిగా అల్టిమా తులే!

Fri,January 4, 2019 02:27 AM

Nasa New Horizons Snowman shape of distant Ultima Thule revealed

వాషింగ్టన్, జనవరి 3: ఇప్పటివరకు గుర్తించిన అత్యంత సుదూర, పురాతన ఖగోళ వస్తువుగా పరిగణిస్తున్న అల్టిమా తులేకు చెందిన స్పష్టమైన ఫొటోలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా)కు చెందిన న్యూ హారిజాన్ వ్యోమనౌక భూమికి చేరవేసింది. ఇందులో అల్టిమా తులే ఎరుపు రంగులో మంచు మనిషి (స్నోమ్యాన్)లాగా కనిపిస్తున్నట్లు నాసా వెల్లడించింది. 450 కోట్ల సంవత్సరాల కిందట గ్రహాలు ఏర్పడిన విధానాన్ని ప్రతిబింబించేలా ఫొటోలు ఉన్నాయని తెలిపింది. అత్యంత చిన్న వస్తువును ఇంతటి వేగంలో ఇప్పటివరకు ఏ వ్యోమనౌక కూడా గుర్తించలేదని, న్యూ హారిజాన్ అరుదైన ఘనత సాధించిందని న్యూ హారిజాన్ ముఖ్య పరిశోధకులు అలన్ స్టెర్న్ తెలిపారు. 27 వేల కి.మీ. దూరం నుంచి తీసిన తాజా ఫొటోలు అల్టిమా తులే రెండు గోళాలతో ఏర్పడి ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయని నాసా తెలిపింది. ఆ రెండు గోళాలు కలిసిపోయి స్నోమ్యాన్‌గా కనిపిస్తున్నదని వివరించింది. పెద్ద గోళాన్ని అల్టిమా, చిన్నగోళాన్ని తులేగా వ్యవహరిస్తున్నారు. న్యూహారిజాన్ టైం మిషన్‌లాంటిది. సౌర కుటుంబం ఆవిర్భావం నాటికి మనల్ని తీసుకెళుతున్నది. అల్టిమా తులేపై పరిశోధనలు చేయడం ద్వారా గ్రహాల ఆవిర్భావాన్ని తెలుసుకునేందుకు వీలవుతుంది అని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.

766
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles