పాక్‌లో ఘోర రైలు ప్రమాదం

Fri,July 12, 2019 02:13 AM

More than a dozen killed in Pakistan train collision

- గూడ్సు రైలును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు
- 16 మంది మృతి.. 80 మందికిపైగా గాయాలు


లాహోర్/ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. గూడ్సు రైలును ప్యాసింజర్ రైలు బలంగా ఢీకొట్టడంతో 16 మంది మరణించారు. 80 మందికిపైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన గురువారం పంజాబ్‌లోని వాల్హర్ రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. ఖ్వెట్టాకు బయలుదేరిన అక్బర్ ఎక్స్‌ప్రెస్ రైలు వాల్హర్ రైల్వేస్టేషన్ వద్దకు రాగానే అది ప్రయాణించాల్సిన పట్టాలను దాటుకొని వేరే పట్టాల మీదుగా ఎదురుగా ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడం తో 16 మంది అక్కడికక్కడే మరణించారు. విషయం తెలియగానే సైన్యం, రైల్వే సిబ్బం ది సహాయ చర్యలను చేపట్టారు. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటికి తీశా రు. క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించారు. కాగా ప్రమాదం ధాటికి ప్యాసింజర్ రైలింజిన్ ఘోరంగా దెబ్బతిన్నది. 3 బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యా యి. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సం ఖ్య పెరిగే అవకాశముంది. ఈ దుర్ఘటనపై పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ, ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ మాట్లాడుతూ ప్రమాదానికి మనుషుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తున్నదని, దర్యాప్తునకు ఆదేశించానని తెలిపారు.

2252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles