మాలిలో ఊచకోత.. 50 మంది మృతి

Sun,March 24, 2019 01:34 AM

More than 50 killed in Mali militia attack

బమాకో: మాలి దేశంలో డొగోన్ జాతి వేటగాళ్లకు, ఫులాని సామాజిక వర్గానికి చెందిన రైతులకు మధ్య జరిగిన ఘర్షణలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారంతా ఫులాని సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. ఈ ఊచకోత శనివారం సెంట్రల్ మాలిలోని ఒగస్‌సగౌవ్ గ్రామంలో చోటుచేసుకుంది. డొగోన్ వేటగాళ్లకు, ఫులాని రైతులకు చాలా కాలం నుంచి గొడవులు జరుగుతున్నాయి. ఫులాని ప్రజలు తమ భూముల్లో పశువులను మేపుతున్నారని డొగోన్ వేటగాళ్లు ఆరోపిస్తున్నారు. అంతేగాక వీరిద్దరి మధ్య భూమి, నీటి పంచాయితీలు కూడా జరుగుతున్నాయి.

203
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles