ఫిలిప్పీన్స్‌ పై విరుచుకుపడ్డ కైటాక్ తుఫాన్


Mon,December 18, 2017 03:08 AM

-కొండచరియలు విరిగిపడి 30మంది మృతి
-87,700 మంది నిరాశ్రయులు
-వరదల్లో చిక్కుకొన్న 15,500 మంది ప్రయాణికులు

ఫిలిప్పీన్స్: కైటాక్ తుఫాన్ ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేస్తున్నది. తుఫాన్ ధా టికి బిల్లిరాన్ ద్వీపంలో కొండచరియలు విరిగిపడి, 30మంది మరణించారు. 23మంది గల్లంతయ్యారు. 87,700 మంది నిరాశ్రయులయ్యారు. తూర్పు ప్రాంతంలోని ద్వీప సమూహంలో పడవల రవాణాను నిలిపివేయటంతో దాదాపు 15,500 మంది ప్రయాణికులు నీటిలో చిక్కుకున్నారు. వీరిలో క్రిస్మ స్ సెలవుల్లో ఇండ్లకు బయలుదేరినవారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. పలు పట్టణాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. 39 పట్టణాలు, నగరాలపై కైటాక్ ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు ఆ దేశ జాతీయ విపత్తు నివారణ సంస్థ పేర్కొంది. శనివారం గంటకు 80 కిమీ వేగంతో బలమైన గాలులు వీచాయి. లెయిటీ నగరంలో 1.5 మీటర్ల ఎత్తులో వరద నీరు పోటెత్తింది. ఆదివారం మధ్యాహ్నానికి తుఫాన్ నెమ్మదించినా, ఇంకా వరదలు పోటెత్తే అవకాశం ప్రమాదం ఉన్నది. క్రిస్మస్ సెలవుల్లో ఇండ్లకు బయలుదేరిన పలువురు వరదల్లో చిక్కుకొన్నారు. తాను మూడ్రోజులుగా బస్సులోనే ఉన్నట్టు ఓ రైతు ఆందోళన వ్యక్తంచేశారు.
Philippines

చిలీలోనూ భారీ వర్షాలు

చిలీలోనూ భారీవర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగడంతో సమీప ఇండ్లలోకి వరద పోటెత్తింది.పలు ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 200 ఇండ్లున్న ఓ గ్రామంలో 20 ఇండ్లు పూర్తిగా నీటమునిగాయి. ఐదుగురు చనిపోగా, 15మంది గల్లంతయ్యారు. పరిస్థితిని సమీ క్షించిన చిలీ దేశాధ్యక్షురాలు మిచెల్లి బాచ్లెట్ దక్షిణ చిలీని విపత్తు ప్రాంతంగా ప్రకటించారు. సహాయ, పునరావాస చర్యలను చేపట్టాలని ఆదేశించారు.

527

More News

VIRAL NEWS