కంటినిండా కాంటాక్ట్ లెన్సులే!


Mon,July 17, 2017 02:39 AM

-ఏకంగా 27 తొలగించిన భారత సంతతివైద్యుడు
లండన్: అవి కండ్లు కాదు కాంటాక్ట్ లెన్సుల కుప్పలు అనేలా.. లండన్‌లోని ఓ వృద్ధురాలి కంట్లో ఏకంగా 27 కాంటాక్ట్ లెన్సులు గుర్తించారు బ్రిటన్‌లోని భారతసంతతికి చెందిన కంటి వైద్య నిపుణులు. బర్మింగ్‌హమ్ సమీపంలోని సోలిహుల్ దవాఖానలో రూపాల్ మొర్జారియా ట్రైనీ నేత్రవైద్యులుగా పనిచేస్తున్నారు. కంటిశుక్లాల సమస్య అంటూ 67 ఏండ్ల వృద్ధురాలు దవాఖానకు వచ్చారు. పరీక్షించిన రూపాల్.. ఆమె కంటిలో 17 కాంటాక్ట్ లెన్సులు ఉన్నట్టు కనుగొన్నారు. ఆ తర్వాత చిన్నపాటి పరీక్షలు జరిపి మరో పది లెన్సులు ఉన్నట్టు గుర్తించి తొలగించారు. ఇప్పటివరకు ఇలాంటి ఘటన చూడలేదు. కాంటాక్ట్ లెన్సులన్నీ ముద్దగా మారాయి. దీంతో కన్ను నీలిరంగులోకి మారింది. ఈ విషయాన్ని రోగి గుర్తించకపోవడం ఆశ్చర్యకరం అని రూపాల్ పేర్కొన్నారు. వృద్ధురాలు 35 ఏండ్లుగా ప్రతినెలా పునర్వినియోగించని కాంటాక్ట్ లెన్సులను వాడటం, ఒకసారి పెట్టిన వాటిని మళ్లీ తీయకుండా కొత్తవి పెట్టడంతో మొత్తం ముద్దగా మారినట్టు చెప్పారు.

721

More News

VIRAL NEWS