Telangana Intermediate 1st & 2nd Year Results 2019

మాలీ నరమేథం.. 134కు చేరిన మృతులు

Mon,March 25, 2019 01:57 AM

Militia attack on Mali village leaves at least 134 dead

-బాధితుల్లో గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు

బమాకో, మార్చి 24: మాలీలో ఊచకోత మృతుల సంఖ్య 134కు పెరిగినట్టు ఐక్యరాజ్య సమితి పేర్కొన్నది. డోగన్ తెగకు చెందినవారు శనివారం సాయంత్రం సెంట్రల్ మాలీలోని ఒగొస్సొగౌ గ్రామంలో నరమేథానికి పాల్పడి తబితల్ పులాకు తెగకు చెందిన ప్రజలను ఊచకోత కోసిన విషయం తెలిసిందే. ఈ మారణకాండకు సంబంధించిన వీడియో ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితుల మృతదేహాలను నేలపై చెల్లాచెదురుగా పడవేసి వారి ఇండ్లను దగ్ధం చేస్తున్న దృశ్యాలు ఆ వీడియో ఉన్నాయి. బాధితుల్లో పలువురు గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నట్టు పులాకు గ్రూపు వెల్లడించింది. బాధితుల్లో చాలా మందిని వారి ఇండ్లలోనే సజీవదహనం చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాలీలో పర్యటిస్తున్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ డెలాట్రే ఈ నరమేథాన్ని తీవ్రంగా ఖండించారు.

1726
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles