నవాజ్‌షరీఫ్ తొలిగింపులో సైన్యం పాత్ర లేదు


Wed,September 20, 2017 12:18 AM

పాక్ ఆర్మీ చీఫ్ కమర్‌జావేద్ వెల్లడి
ఇస్లామాబాద్, సెప్టెంబర్ 19: పాక్ మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ను తొలగించడంలో సైన్యం పాత్ర లేదని ఆ దేశ సైనికాధిపతి జనరల్ కమర్‌జావేద్ స్పష్టం చేశారు. గతకొంత కాలంగా జరుగుతున్న ప్రచారం అసంబద్ధమైనదని ఖండించారు. తాను ప్రజాస్వామ్యవాదినని, పార్లమెంట్ ఔన్నత్యంపై తనకు నమ్మకం ఉందని జావేద్ పేర్కొన్నారు. సోమవారం జాతీయ అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు జావెద్ సమాధానం ఇచ్చారు. బడ్జెట్‌లో కేవలం 18శాతం మాత్రమే రక్షణ రంగానికి కేటాయిస్తున్నారని, అది సరిపోవడంలేదన్నారు.

139

More News

VIRAL NEWS