తల్లిదండ్రులను, పిల్లలను విడదీయొద్దు!

Tue,June 19, 2018 01:46 AM

Melania Trump hates family separations and puts the onus on both sides to fix it

-భర్త వలస విధానాలను తప్పుబట్టిన మెలానియా ట్రంప్
-చిన్నారులను నిర్బంధ గృహాల్లో పెట్టడం క్రూరత్వం: లారా బుష్
-అమెరికాను శరణార్థుల శిబిరంగా మార్చబోను: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న అమానవీయ వలస విధానంపై ఏకంగా ఆయన భార్య మెలానియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వలస ప్రజలను, వారి పిల్లలను అమెరికా సరిహద్దుల్లో వేరుచేయడాన్ని తాను చూడలేకపోతున్నానని ఆ మె ఆవేదన వ్యక్తంచేశారు. ఒక పద్ధతి లేకుండా ఇష్టం వచ్చి నట్లు దౌత్యనీతితో అందరినీ హడలగొడుతున్న ట్రంప్‌పై వివిధ దేశా లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 19 నుంచి మే 31 వరకు 2 వేల మంది పిల్లలను తమ తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి వేరు చేసి చిన్నారుల నిర్బంధ గృహాల్లో ఉం చారు.

తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరుచేయడాన్ని మెలానియా చూడలేకపోతున్నారు. అన్ని చట్టాలను అమలు చేస్తున్న దేశంగా ఉండటం సరైనదేనని ఆమె నమ్ముతున్నారు. హృదయంతో కూడిన పాలనను అందించడమూ ప్రధాన అంశమని ఆమె భావిస్తున్నారు అని మెలానియా అధికార ప్రతినిధి స్టెఫానీ గ్రాషమ్ అన్నారు. స్లొవేనియాలో పుట్టిన మెలానియా కూడా ఒక వలసదారేనని గుర్తుచేశారు.

నైతికత లేని వలస విధానం: లారా బుష్

అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న వలస విధానంపై మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ భార్య లారా బుష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏమాత్రం కరుణలేని ఈ విధానం క్రూరమైంది. దీనికి నైతికత లేదు. తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరుచేసే చర్య నా హృదయాన్ని ముక్క లు చేస్తున్నది వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు రాసిన లేఖలో పేర్కొన్నా రు. బేరసారాలకు పిల్లలు సాధనాలుగా మారకూడదని మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ ట్వీట్ చేశారు. మరోవైపు ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ.. వలస విధానాన్ని సడలించేది లేదని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. యూరప్ దేశాల మాదిరిగా అమెరికాను శరణార్థుల శిబిరంగా మార్చటానికి తాను అనుమతించనని చెప్పారు.

498
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles