ఫిలిప్పీన్స్‌లో భారీ వరదలు

Wed,September 13, 2017 02:22 AM

Manila floods as tropical depression slams Philippines

నలుగురు మృతి, ఆరుగురు గల్లంతు
manila
మనీలా: ఉష్ణమండల వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేశాయి. రాజధాని మనీలాతోపాటు ఇతర రాష్ర్టాల్లో భారీ వరదలు సంభవించాయి. వరదలు, కొండచరియలు విరిగి పడటంతో నలుగురు మృతిచెందగా మొత్తం ఆరుగురు గల్లంతయ్యారు. లగునా రాష్ట్రంలోని ఓ ఇంటిని వరదనీరు నదిలోకి ఈడ్చుకెళ్లడంతో ఆ ఇంట్లో ఉన్న ఐదుగురు కనిపించకుండాపోయినట్లు సహాయ బృందాలు వెల్లడించాయి. కావిట్ రాష్ట్రంలో మరో వ్యక్తి వరదల్లో కొట్టుకుపోయారు. ఈ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూతపడగా.. 21 విమానాలను రద్దు చేశారు. తూర్పు క్వీజాన్ రాష్ట్రంలో వాయుగుండం తీరాన్ని దాటిందని, ఇది వాయవ్యం దిశగా కదులుతున్నదని ఫిలిప్పీన్స్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న నేపథ్యంలో మనీలా సహా ఇతర రాష్ర్టాల్లో మధ్యస్థాయి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని హెచ్చరికలు జారీచేసింది.

507

More News

VIRAL NEWS