బల్గేరియా మహిళా జర్నలిస్టు హత్యకేసులో నిందితుడి అరెస్ట్

Wed,October 10, 2018 01:58 AM

Man Freed After Being Held In Probe Into Killing Of Bulgarian Journalist

అనుమానితుడు రొమేనియా పౌరునిగా గుర్తింపు
సోఫియా: లైంగికదాడి తర్వాత హత్యకు గురైన బల్గేరియా మహిళా జర్నలిస్టు విక్టోరియా మారినోవా (30) కేసులో పోలీసులు ఓ అనుమానితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అనుమానితుడు ఉక్రెయిన్ సంతతికి చెందిన రొమేనియా పౌరుడని పోలీసులు మంగళవారం వెల్లడించారు. నేరం జరిగిన సమయంలో అతడు ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి 24 గంటలపాటు అతడిని నిర్బంధించామని తెలిపారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిధుల దుర్వినియోగంపై పరిశోధనాత్మక కథనాలను ప్రసారం చేసినందుకే విక్టోరియాపై గుర్తుతెలియని దుండగులు లైంగికదాడి చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆమె నివసించే రూస్ పట్టణంలోని ఓ పార్కు వద్ద శనివారం పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు.

625
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles