పద్మావత్‌ను అనుమతించం


Sat,January 13, 2018 01:45 AM

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ పునరుద్ఘాటన
Chouhan
భోపాల్: మధ్యప్రదేశ్‌లో పద్మావత్ సినిమా విడుదల కానీమబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ తెలిపారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సూర్య నమస్కార్ అనే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పద్మావత్ సినిమాను రాష్ట్రంలో నిషేధిస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... దీనిపై నేను ఇదివరకు ఏం చెప్పానో.. అదే జరుగుతుంది అని సమాధానం ఇచ్చారు. సినిమాలో రాణి పద్మావతి గౌరవాన్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని రాజ్‌పుత్‌లు కొందరు నవంబర్ 20న శివరాజ్‌సింగ్ చౌహన్ దృష్టికితీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో చరిత్రను వక్రీకరించే సినిమాను తాము అనుమతించబోమని ఆయన అప్పుడు చెప్పారు.

311

More News

VIRAL NEWS