ఎక్స్‌రేలతో గుండెజబ్బులు !

Sun,July 16, 2017 01:54 AM

xray
లండన్: చీటికి మాటికి ఎక్స్‌రేలు తీయించుకోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. జర్మనీలోని హెల్మోత్ మంచెన్ పరిశోధనాసంస్థకు చెందిన శాస్త్రజ్ఞులు ఈ పరిశోధన నిర్వహించారు. తక్కువ మోతాదు రేడియేషన్‌కు గుండె ధమనుల కణజాలం ఏ విధంగా స్పందిస్తుందన్న అంశంపై వారు పరిశోధన చేశారు. తరచూ రేడియేషన్‌కు గురికావడం గుండె కణజాలం పనితీరుపై దుష్ప్రభావం చూపుతుందని, గుండె ధమనుల లోపలిపొరలోని కణాల్లో మార్పులు వస్తాయని వీరు గుర్తించారు. రక్తనాళాల్లోని ఎండోథీసియల్ కణాలు తక్కువ పరిమాణంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయని, అది రక్తనాళాల సంకోచాలపై ప్రభావం చూపుతుందని ఈ పరిశోధనలో వెల్లడయ్యింది.

438
Tags

More News