రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు భయంతో


Mon,February 12, 2018 11:52 PM

-లండన్ విమానాశ్రయం మూసివేత
లండన్, ఫిబ్రవరి 12: బ్రిటన్ రాజధాని లండన్ విమానాశ్రయాన్ని సోమవారం మూసివేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో లండన్‌లోని థేమ్స్ నదీ సమీపాన జార్జి వీ డాక్ వద్ద 500 కిలోల బరువుల గల రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు కనిపించడంతో విమానాశ్రయం నుంచి అన్ని విమాన సర్వీసులు రద్దు చేసినట్లు మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. సదరు బాంబును నౌకాదళ సిబ్బంది తొలిగించేందుకు వీలుగా విమాన సర్వీసులు రద్దు చేశామని ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. దీనివ్ల 16 వేల మంది ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుందన్నారు. లండన్ విమానాశ్రయం నుంచి ప్రయాణం చేయగోరే వారంతా తదుపరి సమాచారం ఇచ్చే వరకు రావద్దని విమానాశ్రయం సీఈవో రాబర్ట్ సిైంక్లెర్ తెలిపారు.

185

More News

VIRAL NEWS