భారత్‌లో ఎఫ్-16 యుద్ధ విమానాలు తయారుచేస్తాం


Sun,January 21, 2018 12:43 AM

అమెరికా సంస్థ లాక్‌హీడ్ మార్టిన్స్ ఏరోనాటిక్స్ ప్రతిపాదన
వాషింగ్టన్, జనవరి 20: భారతదేశంలో ఎఫ్ -16 యుద్ధ విమానాల తయారీ చేపడతామని అమెరికా ఏరోస్పేస్, రక్షణ రంగ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ ఏరోనాటిక్స్ పేర్కొన్నది. ఇది భారత పరిశ్రమకు లభించిన అపూర్వమైన అవకాశం అని ఆ సంస్థ అధికారులు తెలిపారు. యుద్ధ విమానాలను భారత్‌లోనే తయారు చేయాలని నిర్ణయించామని లాక్‌హీడ్ మార్టిన్ ఏరోనాటిక్స్ వ్యూహం, వ్యాపార అభివృద్ధి విభాగం ఉపాధ్యక్షుడు వివేక్ లాల్ చెప్పారు. యుద్ధ విమానాల తయారీకి భారత్‌లో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, మరే దేశంలోనూ అనుకూల పరిస్థితులు లేవని అన్నారు. భారత్ అవసరాలకు అనుగుణంగా వీటిని నిర్మిస్తామని తెలిపారు.

317

More News

VIRAL NEWS