ముగిసిన లీ జియావోబో అంత్యక్రియలు


Sun,July 16, 2017 01:58 AM

-ఆయన భార్యకు గృహనిర్బంధం నుంచి విముక్తి కల్పించాలని చైనా నిర్ణయం
XIAOBO
బీజింగ్, జూలై 15: చైనాకు చెందిన హక్కుల ఉద్యమకారుడు, నోబెల్ బహుమతి గ్రహీత లీ జియావోబో అంత్యక్రియలు శనివారం ముగిశాయి. ఈశాన్య చైనాలోని షేన్యంగ్ సిటీలో స్థానిక ఆచారాల ప్రకారం నిర్వహించిన అంత్యక్రియలకు కుటుంబసభ్యులు, స్నేహితులు, స్థానికులు హాజరయ్యారు. జైలు శిక్ష అనుభవిస్తూ క్యాన్సర్‌తో ఆయన గురువారం మృతిచెందిన విషయం తెలిసిందే.

అయితే గత కొన్నేండ్లుగా గృహనిర్బంధంలో ఉన్న ఆయన భార్య లీ జియోకు త్వరలోనే విముక్తి కల్పించాలని, అంతర్జాతీయ ఒత్తిడి నేపథ్యంలో ఆమె దేశం విడిచి వెళ్లడానికి అనుమతించాలని చైనా నిర్ణయించింది. షేన్యంగ్ సమాచార కార్యాలయ అధికార ప్రతినిధి జాంగ్ క్వింగ్యాంగ్ మాట్లాడుతూ.. లీ జియో చైనీయురాలని, చట్ట ప్రకారం ఆమెకు సహకరిస్తామని చెప్పారు. భర్తను కోల్పోయి శోకసంద్రంలో మునిగి ఉన్న ఆమెకు గృహనిర్బంధం నుంచి త్వరలోనే విముక్తి కల్పిస్తామని, కానీ ఆమె సమస్యలను తెచ్చిపెట్టవద్దని సూచించారు. మరోవైపు చైనా ప్రజలు లీ జియావోబోకు నివాళులర్పించారు. హంగ్‌కాంగ్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

363
Tags

More News

VIRAL NEWS