బంగ్లాదేశ్‌లో రచయిత దారుణహత్య

Wed,June 13, 2018 03:13 AM

Leftist leader and publisher shot dead in Munshigonj

-కాల్చిచంపిన దుండగులు
-లౌకికవాదానికి మద్దతుగా గళం విప్పినందుకే ఈ దారుణం
shahjahan-bachchu
ఢాకా: బంగ్లాదేశ్‌లో ప్రముఖ రచయిత, ప్రచురణకర్త, లౌకికవాది షాజహాన్ బచ్చు(60) దారుణహత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపి హత్యచేశారు. ముస్లిం జనాభా అధికంగా గల బంగ్లాదేశ్‌లో బిశాక ప్రకాశిని అనే ప్రచురణ సంస్థను నడుపుతూ బహిరంగంగా లౌకికవాదా న్ని సమర్ధించారు. సోమవారం సాయంత్రం ఇఫ్తార్‌కు ముందు మున్షిగంజ్ జిల్లా కాకాల్ది గ్రామంలోని తన ఇంటికి సమీపంలో ఉన్న ఒక ఔషధాల దుకాణంలో స్నేహితులను కలిసేందుకు బచ్చు వెళ్లారు. అక్కడకు మోటర్ సైకిళ్లపై చేరుకున్న ఐదుగురు దుండగులు దుకాణం బయట నాటుబాంబు పేల్చి భయానక వాతావరణాన్ని సృష్టించారు. తర్వాత ఆయనను దుకాణం నుంచి బయటకు లాక్కొచ్చి కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. బచ్చును ఇస్లామిక్ తీవ్రవాదులే హత్యచేసి ఉంటారని అనుమానిస్తున్నారు. గతంలోనూ బచ్చుకు తీవ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు వచ్చాయి. బచ్చు బంగ్లాదేశ్ కమ్యూనిస్ట్ పార్టీకి జిల్లా కార్యదర్శిగానూ పనిచేశారు.

726
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS