జాదవ్ కేసు విచారణకు పాక్ మాజీ చీఫ్ జస్టిస్

Thu,October 12, 2017 12:46 AM

Kulbhushan Jadhav case Former CJP Tassaduq Jilani appointed as ad hoc judge at ICJ

ఐసీజేకు పాక్ ప్రభుత్వం సిఫారసు
ఇస్లామాబాద్: అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో కుల్‌భూషణ్ జాదవ్ కేసు విచారణకు తమ మాజీ ప్రధాన న్యాయమూర్తి తస్సాదుక్ హుసేన్ పేరును పాకిస్థాన్ సిఫారసు చేసింది. ఈ కేసు విచారణలో తాత్కాలిక న్యాయమూర్తిగా వ్యవహరించేందుకు హుసేన్‌ను ఎంపిక చేసినట్టు పాక్ తెలిపింది. పాక్ ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానికి ఈ విషయమై గురువారం లేఖ రాసింది. భారతీయ నౌకాదళ మాజీ అధికారి జాదవ్‌కు పాక్ సైనిక న్యాయస్థానం గూఢచర్యం ఆరోపణలపై మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిని అంతర్జాతీయ కోర్టులో భారత్ సవాల్ చేసింది.

158

More News

VIRAL NEWS