ఖలీదా జియాకు తాత్కాలిక బెయిల్


Tue,March 13, 2018 02:24 AM

Khaleda
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధినేత్రి ఖలీదా జియా (72)కు తాత్కాలిక ఊరట లభించింది. అవినీతి కేసు లో శిక్ష అనుభవిస్తున్న ఆమెకు ఢాకా హైకోర్టు నాలుగునెలల బెయిల్ మంజూరు చేసింది. విదేశీ నిధులు దుర్వినియోగంచేసిన కేసులో ఖలీదాకు ఐదేండ్ల జైలు శిక్షను ఢాకా ప్రత్యేకకోర్టు విధించింది. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి దాదాపు నెలపాటు జైలు శిక్షను ఖలీదా అనుభవించారు. తర్వాత హైకోర్టును ఆశ్రయించిన ఆమెకు.. నాలుగునెలల బెయిల్‌ను ధర్మాసనం మంజూరుచేసింది.

208

More News

VIRAL NEWS