బ్రిటన్ రాజకుటుంబంలో బుల్లి వారసుడు


Tue,April 24, 2018 03:53 AM

britain-royals
మగబిడ్డకు జన్మనిచ్చిన కేట్ మిడిల్టన్
లండన్: బ్రిటన్ రాజ కుటుంబంలోకి మరో వారసుడొచ్చా రు. ప్రిన్స్ విలియమ్స్ భార్య కేట్ మిడిల్టన్ పండంటి మగబిడ్డను ప్రసవించారు. ఈ పసికందు విలియమ్స్ దంపతులకు మూడో సంతానం. బ్రిటి ష్ రాజ కుటుంబానికి ఐదో వారసుడు. ఇంకా పేరు పెట్టని పసికందు ప్రిన్స్ చార్లెస్‌కు మనుమడు. బ్రిటన్ మహారాణి ఎలిజబెత్‌కు ఆరో ముని మనుమడు. కేట్ మిడిల్టన్ సోమవారం లండన్‌లోని లిండో వింగ్ సెయింట్ మేరీ స్ దవాఖానలో చేరారు. ఉదయం 11 గంటలకు మగబిడ్డకు జన్మనిచ్చారని బ్రిటన్ రాజ కుటుం బం ఒక ప్రకటనలో తెలిపింది. పసికందు 3.82 కిలోల బరువు ఉన్నాడని, తల్లీ కొడుకులు ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నది. ఇదే దవాఖానలో 2013లో జార్జిని, 2015లో చార్లట్‌కు కేట్ మిడిల్టన్ జన్మనిచ్చారు. మగ శిశువును కన్న విలియమ్స్ దంపతులకు ప్రధాని థెరెసా మే ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. వారు భవిష్యత్‌లో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

1463

More News

VIRAL NEWS