12 కోట్ల భారీ స్కాం

Fri,March 15, 2019 01:45 AM

-కరీంనగర్ యూనియన్ బ్యాంక్‌లో వెలుగుచూసిన స్వాహాపర్వం
-మేనేజరే ప్రధాన సూత్రధారి
కరీంనగర్ క్రైం : కరీంనగర్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (చెస్ట్)లో రూ. 12 కోట్ల భారీ కుంభకోణం వెలుగుచూసింది. బ్యాంక్ మేనేజరే ఈ స్కాంకు సూత్రదారి. బ్యాంకు అధికారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. కరీంనగర్ నడిబొడ్డున రాజీవ్‌చౌక్‌లో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రధానశాఖ ఉన్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 28 శాఖలకు ఈ బ్యాంకు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నది. అధికారులు ఇటీవల ఆడిటింగ్ నిర్వహించగా రూ.12 కోట్లు తేడావచ్చింది. మేనేజర్ సురేశ్‌కుమార్‌ను విచారించగా ఆ డబ్బును తానే వాడుకున్నట్టు అంగీకరించారు. దీంతో అధికారులు పోలీసులను ఆశ్రయించారు. రూ. 5 కోట్లు ఇస్తే వారంలో రూ. 15 లక్షల గుడ్‌విల్ ఇస్తానని నమ్మించడంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌కు చెందిన వ్యక్తికి డబ్బు ఇచ్చినట్టు మేనేజర్ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది.

అదే వ్యక్తికి మరోసారి రూ. 25 లక్షలు గుడ్‌విల్ కోసం రూ. 7 కోట్లు ఇచ్చినట్టు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. రూ. 3 కోట్లకు మించిన లావాదేవీలకు సంబంధించిన కేసులను పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేసే అవకాశం లేకపోవడంతో కేసును సీబీఐకి బదిలీచేయనున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మేనేజర్ సురేశ్‌కుమార్‌తోపాటు సెక్యూరిటీ గార్డు మాధవరం సంపత్‌కుమార్(40), సిరిసిల్ల జిల్లా రేపాకకు చెందిన నరేశ్(26), హుస్నాబాద్‌కు చెందిన సంతోష్ (30)ను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.

584
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles