అమెరికా అధ్యక్ష బరిలో నేను సైతం!

Tue,January 22, 2019 02:31 AM

Kamala Harris jumps into US presidential race

-ట్రంప్‌పై పోటీకి కమలా హ్యారిస్ సిద్ధం
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్న పలువురు భారతీయ అమెరికన్లు దేశ అధ్యక్ష పదవికీ పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. భారత సంతతికి చెందిన సెనెటర్ కమలా హ్యారిస్ 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై పోటీకి దిగుతానని సోమవారం ప్రకటించారు. మహాత్మాగాంధీ నుంచి స్ఫూర్తి పొందానని చెప్పుకున్న మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ జయంతిని అమెరికన్లు జరుపుకుంటున్న సమయంలో తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని ప్రకటించడం గర్వంగా ఉందని కమల పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తొలి భారత సంతతి సెనేటర్‌గా ఆమె రికార్డులకెక్కారు. ట్రంప్ విధానాలను విమర్శిస్తూ కమలా హ్యారిస్ ఇటీవల వార్తల్లో నిలుస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి నామినేషన్ కోసం పోటీ పడుతున్న వారిలో హ్యారిస్ నాలుగో వ్యక్తి. నేను అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నా అని ఆమె ట్వీట్ చేశారు. కమలా హ్యారిస్: ప్రజల కోసం అన్న నినాదం తన ప్రచారాంశమని తెలిపారు.

791
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles