ట్రంప్ చేష్టలతో నవ్వులు పువ్వులు


Tue,November 14, 2017 12:45 AM

మనీలా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చపలచిత్తమైన వ్యాఖ్యలు, బహిరంగ చేష్టల తో ఎప్పుడూ వార్తల్లోకెక్కుతుంటారు. కొన్నిసార్లు ఆయ న చేష్టలు నవ్వులు కూడా పూయిస్తుంటాయి. ఆసియాన్ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో కూడా ఆయన చేష్టలు హాస్యభరితంగా మారాయి. వేదికపైనున్న నేతలందరూ ఒకరిచేయి ఒకరు పట్టుకోవాలి. అయితే ఫిలిప్పీన్స్ సంప్రదాయం ప్రకారం కుడిచేతిని ఎడమవైపున్న వారికి, ఎడ మ చేతిని కుడివైపు ఉన్నవారికి అందించాలి. ఈ క్రమం లో తన చేతులను ఇరుపక్కలనున్న నేతలకు అందించలేక ట్రంప్ ఇబ్బంది పడటం నవ్వుల జల్లును కురిపించింది. ఆదివారం కూడా ట్రంప్ జపాన్ ప్రధాని షింజో అబే, ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు హిడేకి మత్సుయామాతో కలిసి గోల్ఫ్ ఆడేందుకు వెళ్లారు. ఆ సమయంలో అదుపుతప్పిన అబే ఓ గుంతలో పడిపోయి అంతలోనే లేచి నిల్చున్నారు. ఈ దృశ్యాన్ని ట్రంప్ గమనించలేదు. దీనిపై బీబీసీ వార్తా సంస్థ షింజో అబే గుంతలో పడినా ట్రంప్ తన గోల్ఫ్ ఆటను కొనసాగించారు అంటూ ఓ కథనాన్ని ప్రసారం చేసింది.

309
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS