జపాన్ చక్రవర్తి సింహాసనం త్యజింపు


Sat,May 20, 2017 01:58 AM

japan
టోక్యో: సింహాసనం త్యజించాలని జపాన్ చక్రవర్తి అకిహితో తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తూ ఆ దేశ మంత్రివర్గం శుక్రవారం ఒక బిల్లును ఆమోదించింది. ప్రధానమంత్రి సింజో అబే మంత్రివర్గం ఈ బిల్లుపై సంతకం చేసింది. జపాన్‌లో రెండు శతాబ్దాల కాలంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. బిల్లు చట్టంగా మారిన మూడేండ్లలోపు చక్రవర్తి సింహాసనాన్ని పరిత్యజించవచ్చు. 2018 డిసెంబర్ నాటికి సింహాసనం దిగిపోవాలని జపాన్ చక్రవర్తి 83 ఏండ్ల అకిహితో నిర్ణయించుకున్నట్టు, 2019 జనవరి ఒకటి నాటికి సింహాసనానికి వారసుడైన యువరాజు నరుహితోకు ఆ బాధ్యతలు అప్పగించాలనుకున్నట్టు ఇటీవల వార్తలు వెలువడ్డాయి.

395
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS