రోజుకు 12 గంటలు.. వారానికి 6 రోజులు!

Tue,April 16, 2019 12:58 AM

Jack Ma endorses China controversial 12 hours a day, 6 days a week work culture

-996 ప్రణాళికను సమర్ధించుకున్న జాక్ మా
చైనా : తమ సంస్థలో ఉద్యోగం చేయాలంటే 996 ( రోజుకు 12 గంటలు - ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు, వారంలో 6 రోజులు) ప్రణాళికతో పని చేయాల్సిందేనని వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న చైనాలోని అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా మరోసారి ఆదివారం తన బ్లాగులో ఇలాంటి ప్రకటనే చేశారు. కొన్ని రోజుల క్రితం.. 996 ప్రణాళిక గురించి నేను చేసిన వ్యాఖ్యలు పలు చర్చలు, విమర్శలకు తావివ్వడాన్ని నేను ముందే ఊహించా. ఇలాంటి వాళ్ల మనస్తత్వం తెలుసు. నేను సరైనవి (తక్కువ గంటలు పని, ఎక్కు వ సెలవులు) చెబితే బాగుండేది. కానీ, ప్రస్తుత ప్రపంచంలో సరైన వాటిని చెప్పేవాళ్లకు కొదువ లేదు. ప్రజల్ని ఆలోచింపజేసే నిజాయితీగల మాటలు(996 ప్రణాళిక అనే అర్థ్ధంలో) కరువయ్యా యి అంటూ జాక్ మా తన బ్లాగులో రాశారు. కాగా.. ఇటీవల ఒక అంతర్జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 6 రోజులు పనిచేసే 996 పని సంస్కృతిని సమర్థించారు. చైనా మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో అలీబాబా అధికారిక అకౌంట్‌లో దీని గురించి ప్రస్తావించారు.

478
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles