నా కూతురు డైనమైట్!

Thu,October 11, 2018 02:02 AM

Ivanka would be dynamite in UN says Donald Trump

ఇవాంకాపై ట్రంప్ ప్రశంసలు
వాషింగ్టన్, అక్టోబర్ 10: ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా తన కుమార్తె ఇవాంకా డైనమైట్ లాగా పనిచేయగలదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఆమెను ఆ పదవిలో నియమిస్తే తాను బంధుప్రీతికి పాల్పడ్డానన్న ఆరోపణను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ఐరాసలో అమెరికా రాయబారి పదవికి రాజీనామా చేసిన నిక్కీ హేలీ స్థానంలో మరొకరిని రెండు మూడు వారాల్లో నియమిస్తామని చెప్పారు. నిక్కీ హేలీ స్థానంలో తన కూతురు ఇవాంకాను నియమిస్తే డైనమైట్ లాగా పనిచేయగలదని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే ఇవాంకా, తాను ఐరాసలో అమెరికా రాయబారిగా పని చేయబోవడం లేదని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.

602
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles