నిధుల దుర్వినియోగం కేసులో..

Mon,June 17, 2019 02:02 AM

Israeli court convicts Sara Netanyahu for misusing state funds

-ఇజ్రాయెల్ ప్రధాని భార్యకు శిక్ష
-రూ.2 లక్షల జరిమానా విధించిన కోర్టు

జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భార్య సారా నెత్యనాహు(60) నిధుల దుర్వినియోగం కేసులో దోషిగా తేలారు. దీంతో జెరూసలెం కోర్టు ఆమెకు 10,000 షేకిల్స్ (సుమారు రూ.2 లక్షలు) జరిమానాతో పాటు దుర్వినియోగం చేసిన 45,000 షేకిల్స్(సుమారు రూ.9 లక్షలు)ను 9 విడుతల్లో చెల్లించాలని ఆదేశించింది. బెంజమిన్ నెతన్యాహు 2009 నుంచి పదేండ్లుగా ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్నారు. ఆయన భార్య సారా నెతన్యాహు ఆయనతోనే అధికార నివాసంలో ఉంటున్నారు. అక్కడ వారికి భోజనం వండేందుకు ఓ వంటమనిషి ఉన్నప్పటికీ సారా నెతన్యాహు బయట నుంచి భోజనం తెప్పించుకుంటున్నారు. 2018 జూన్‌లో దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజా నిధులను మోసపూరితంగా దుర్వినియోగం చేసినట్లు ఆమె అంగీకరించడంతో జెరూసలెం కోర్టు న్యాయమూర్తి దోషిగా నిర్ధారించి తక్కువ మొత్తంలో జరిమానా విధించారు. సారా నెతన్యాహు వినతి మేరకు భోజనం కోసం దుర్వినియోగం చేసిన నిధులను 9 విడుతల్లో తిరిగి చెల్లించేందుకు అంగీకరించారు.

346
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles