శవాల దిబ్బగా పెండ్ల్లి వేదిక

Mon,August 19, 2019 03:29 AM

Islamic State claims bombing at Kabul wedding that killed 63

-కాబూల్‌లోమారణహోమం
-ఆత్మాహుతి బాంబు పేలి 63 మంది మృత్యువాత
-182 మందికి గాయాలు
-ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మారణహోమం
-తమ పనేనని ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటన

కాబూల్: బంధుమిత్రుల ముచ్చ ట్లు, డ్యాన్సుల మధ్య సంతోషంగా సాగుతున్న పెండ్లి వేడుక ఒక్కసారిగా భీకరంగా మారిపోయింది. పెండ్లి వేదిక శవాల దిబ్బగా మారిం ది. ఎక్కడికక్కడ మృతదేహాలు.. చెల్లాచెదురు గా తెగిపడిన శరీర భాగాలతో ఆ ప్రాంతం రక్తసిక్తమైంది. అప్పటివరకు కేరింతలు కొట్టిన వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఏం జరుగుతున్నదో తెలియక భయాందోళన చెందారు. అరుపులు, కేకలతో ఆ పెండ్లి ప్రాం గణం దద్దరిల్లింది. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ పశ్చిమలో శనివారం రాత్రి పెండ్లి వేడుకలో ఈ ఘోర మారణ హోమం జరిగింది. ఆత్మాహుతి బాంబు పేలుడులో 63 మంది మృతి చెందగా, 182 మంది గాయపడ్డారు.

ఆ దేశ అధికార ప్రతినిధి నస్రత్ రష్మి దీన్ని ధృవీకరించారు. ఈ పేలుడు నుంచి పెండ్లి కుమారుడు, కుమార్తె సురక్షితంగా బయటపడ్డారు. తన సంతోషమంతా ఒక్కసారిగా విషాదమైందని వరుడు మిర్వాజ్ వాపోయారు. స్థానిక టీవీ చానల్‌తో ఆయన మాట్లాడుతూ.. నా సోదరుడు, బంధువులు, స్నేహితులను కోల్పోయాను.. నా కళ్ల్లెదుటే వారి మృతదేహాలను తరలించారు. నా కుటుంబమంతా షాక్‌లో ఉన్నది. వధువు భయంతో మూర్ఛపోయింది. సంతోషాన్ని ఇక నా జీవితంలో చూడలేను అంటూ కన్నీరుమున్నీరయ్యారు.

Kabul3

భద్రత లేనందునే పెండ్లిళ్లపై ఉగ్రదాడులు

ఆఫ్ఘన్‌లో అట్టహాసంగా జరిగే పెండ్లి వేడుకలకు రక్షణ ఏర్పాట్లు ఉండవు. అందుకే పెండ్లిళ్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటారు. సున్నీ లు మెజారిటీగా ఉన్న ఆఫ్ఘన్‌లో షియాలపై దాడులు సర్వసాధారణం. షియా వేడుకలను ఉగ్రమూకలు లక్ష్యంగా చేసుకుంటాయి. తాజా నరమేధం కూడా ఈ కోవలోకి చెందినదే. పెండ్లికి వచ్చిన అతిథులు నృత్యాలు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది అని తీవ్రంగా గాయపడిన మునీర్ అహ్మద్ (23) చెప్పారు. పెండ్లిలో మగవారంతా ఒకవైపు ఉన్నచోట పేలుడు జరిగిందని, 20 నిమిషాలు అక్కడ పొగతో నిండిపోయిందని, అంతా హాహాకారాలు చేస్తూ హాలు నుంచి బయటకు పరుగెత్తారని వేడుకకు హాజరైన అతిథి మహ్మద్ ఫర్హాగ్ తెలిపారు.

తాను మహిళలు ఉన్న చోటుకు అప్పుడే వెళ్లడంతో ప్రాణాలతో బయటపడినట్లు వెల్లడించారు. మరోవైపు ఈ మారణహోమానికి తమదే బాధ్యతని ఉగ్రవాద సంస్థ ఐఎస్ ప్రకటించింది. పెండ్లి స మూహం వద్ద తమ ఆత్మహుతి దళ సభ్యుడు పేల్చుకున్నాడని, సెక్యూరిటీ సిబ్బంది రాగానే బాంబులతో కూడిన వాహనాన్ని పేల్చివేశామని టెలిగ్రామ్ మేసేజ్ యాప్‌లో తెలిపింది. ఈ పెండ్లికి హాజరయ్యేందుకు ఓ వాహనంలో వస్తున్న 11 మంది బాల్ఖష్ ప్రావిన్సు వద్ద రోడ్డు పక్కన జరిగిన బాంబు పేలుడులో మృతిచెందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆఫ్ఘన్‌లో పెండ్లి వద్ద ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది.

Kabul2

అనాగరిక చర్య: అష్రఫ్ ఘని

పెండ్లి వేడుకపై జరిగిన దాడిని అనాగరిక చర్యగా ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని అభివర్ణించారు. ఆ దేశ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అబ్దుల్లా అబ్దుల్లా .. మానత్వంపై జరిగిన నేరమన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని అమెరికా రాయబారి జాన్ బాస్ ఈ దాడిని నీచమైన చర్యగా పేర్కొన్నారు. ఆ దేశం నుంచి సుమారు 14 వేల మంది సైన్యాన్ని వెనక్కి తీసుకునేందుకు తాలిబాన్‌తో అమెరికా జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో ఈ మారణకాండ చోటుచేసుకున్నది.

ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ

ఆఫ్ఘన్ నుంచి తన బలగాలను ఉపసం హరించాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు తాలిబన్లతో అమెరికాకు ఒప్పందం ఖరారైంది. బలగాల ఉపసంహ రణకు కాల్పుల విరమణకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. అయితే ఈ పరిణామం అంతర్యుద్ధానికి ఇది దారి తీయవచ్చని ఆఫ్ఘన్లు కూడా భయాందోళన చెందుతున్నారు.

13435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles