ఇరాన్ డ్రోన్‌ను కూల్చేశాం

Sat,July 20, 2019 01:06 AM

Iran denies claim that US warship destroyed Iranian drone

-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన
- అదేమీ లేదన్న ఇరాన్

వాషింగ్టన్/ టెహ్రాన్, జూలై 19: అమెరికా, ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఉద్రిక్తతలు పెరిగాయి. హర్మూజ్ జలసంధి పరిధిలో ఇరాన్ డ్రోన్‌ను కూల్చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం మీడియాకు చెప్పారు.ఇరాన్‌తో 2015 నాటి అణు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు గతేడాది మేలో ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించాక అమెరికా దూకుడుగా వ్యవహరించడం ఇదే తొలిసారి. గురువారం హార్మూజ్ జలసంధి పరిధిలో నిలిపి ఉన్న తమ బాక్సర్ యుద్ధ నౌకకు సమీపంలో 1000 అడుగుల దూరంలోకి వచ్చిన ఇరాన్ డ్రోన్‌ను హెచ్చరించినా పట్టించుకోలేదని, దీంతో తమ నౌక, సిబ్బంది రక్షణార్థం కూల్చేసినట్లు పెంటగాన్ అధికార ప్రతిని జోన్నథన్ హాఫ్‌మన్ తెలిపారు. శుద్ధిచేసిన యురేనియం నిల్వలను ఇరాన్ పెంచుకునేందుకు ఆ దేశంలోని చైనా, బెల్జియం సంస్థలు కీలక సామగ్రిని సరఫరా చేస్తున్నాయన్నారు. మరోవైపు తాము డ్రోన్లను నష్టపోలేదని, ట్రంప్ ప్రకటన నిరాధారం అని ఇరాన్ పేర్కొంది. ఇరాన్ విదేశాంగశాఖ డిప్యూటీ మంత్రి అబ్బాస్ అరాగ్చి ట్విట్టర్ వేదికగా ప్రతిస్పందిస్తూ.. యూఎస్‌ఎస్ బాక్సర్ పొరపాటున దాని సొంత డ్రోన్‌ను కూల్చివేసిందేమోనని ఆందోళన చెందుతున్నా అని ఎద్దేవాచేశారు.

326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles