భారత్, చైనా, అమెరికాల్లో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు


Thu,October 12, 2017 02:29 AM

ఐఎంఎఫ్ నివేదిక వెల్లడి
inequality
వాషింగ్టన్, అక్టోబర్ 11: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అసమానతలు గణనీయంగా తగ్గుముఖం పట్టినా.. అతిపెద్ద దేశాలైన భారత్, చైనా, అమెరికాల్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొన్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొన్నది. సంపన్న దేశాలతోపాటు వివిధ దేశాల్లోని విభిన్న ఆదాయ వర్గాలకు నాణ్యతతో కూడిన విద్య, ఆరోగ్య పరిరక్షణ సేవల్లో తేడాలు ఉన్నాయని ఐఎంఎఫ్ ద్రవ్య వ్యవహారాల విభాగం డైరెక్టర్ విటోర్ గాస్పర్ తెలిపారు. వార్షిక ద్రవ్య నియంత్రణ నివేదిక విడుదల సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 19వ శతాబ్ది ప్రారంభంలో పెరిగిన ఆర్థిక అసమానతలు ఇటీవలి దశాబ్దాల్లో ప్రపంచ దేశాల్లో తగ్గుముఖం పట్టాయని చెప్పారు. ఈ ఆర్థిక అసమానతల్లో ప్రతి రెండు దేశాల మధ్య తేడా ఉన్నదన్నారు. సంపన్నదేశాల్లో మాత్రం గత మూడు దశాబ్దాల్లో ఆర్థిక అసమానతలు పెరిగాయని అన్నారు. సమగ్ర, సుస్థిర ప్రగతిని ప్రోత్సహించేందుకు సామాజిక చైతన్యం పెంపొందించేందుకు విద్య, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులతో మధ్యకాలికంగా ఆర్థిక అసమానతలను తగ్గించొచ్చునన్నారు. అయితే శరవేగంగా మారుతున్న టెక్నాలజీ వల్ల ఉద్యోగ రంగాల్లో అభద్రతాభావం పెరుగుతున్నదన్నారు. సమర్థ ఆర్థిక ప్రగతి సాధిస్తున్న భారత్, చైనాల్లో ఆర్థిక అసమానతల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయని విటోర్ గాస్పర్ తెలిపారు. ఆర్థిక ప్రగతితోపాటు ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

484

More News

VIRAL NEWS