భారతీయుడివి.. ప్రార్థన చేయించొద్దు!

Tue,March 21, 2017 02:22 AM

Father-Tomy-Kalathoor

భారత సంతతి పాస్టర్‌పై ఆస్ట్రేలియాలో కత్తితో దాడి

మెల్‌బోర్న్: జాత్యహంకార దాడులు ఆస్ట్రేలియాకు కూడా వ్యాపించాయి. ఇటీవల అమెరికాలో పలుచోట్ల భారతీయులపై జరిగిన దాడులు మరువకముందే ఆస్ట్రేలియాలోనూ అలాంటి ఘటనలు చోటుచేసుకోవడంప్రవాసులను కలవర పెడుతున్నది. మెల్‌బోర్న్ శివారు ఫాకనర్ ప్రాంతంలోని సెయింట్ మాథ్యూస్ చర్చి లో ఆదివారం ప్రార్థనలు చేస్తుండగా భారత సంతతి క్రైస్తవ మతగురువుపై అందరూ చూస్తుండగానే దాడి జరిగింది. కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన ఫాదర్ టామీ కలథూర్ మాథ్యూ(48) గొంతులో వంటగదిలో వాడే కత్తితో ఒక ఇటాలియన్ పొడిచాడు అని మెల్‌బోర్న్ డైలీ ఎడిటర్ తిరువల్లూమ్ భసి తెలిపారు.

ఆదివారం చర్చిలో ప్రార్థన జరుగుతుండగా నిందితుడు ఫాదర్ ముం దుకు వచ్చాడు. నువ్వు భారతీయుడివి ప్రార్థనలు చేయించడానికి వీల్లేదు. అంటూ గొంతులో పొడిచాడు. అక్కడి వారు అతడిని అడ్డుకొనే ప్రయత్నం చేయగా పారిపోయాడు అని భసి పేర్కొన్నారు. అనంతరం 72 ఏండ్ల ఇటాలియన్ సంతతికి చెందిన నిందితుడిని మెల్‌బోర్న్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రార్థన సమయంలో ప్రత్యేక దుస్తులు వేసుకున్నందున మెడచుట్టు మందమైన వస్త్రం ఉండటంతో కత్తి లోపలికి దిగలేదని, ఫాదర్‌కు ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం మాథ్యూను డిశ్చార్జ్ చేశామని పేర్కొన్నారు. కోజికోడ్ జిల్లా అనక్కమ్‌పోయిల్ సమీపంలోని కరింబూ గ్రామానికి చెందిన కలథూర్ మాథ్యూ నాలుగేండ్లుగా మెల్‌బోర్న్‌లోని ఓ చర్చిలో మతగురువుకు ప్రతినిధి పనిచేస్తున్నారు.

1022

More News

మరిన్ని వార్తలు...