అమెరికా కస్టడీలో భారతీయుడి మృతి

Sat,May 20, 2017 01:15 AM

న్యూయార్క్: అమెరికా కస్టమ్స్ అధికారుల కస్టడీలో భారతీయుడు ఒకరు మృతిచెందారు. ఈ నెల 10న ఈక్వెడర్ విమానంలో అతుల్‌కుమార్ బాబుభాయ్ పటేల్ అట్లాంటా విమానాశ్రయానికి చేరుకున్నారు. దేశంలోకి ప్రవేశించడానికి అనుమతిపత్రాలు లేకపోవడంతో అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఆయనను అరెస్ట్ చేసి, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) విభాగానికి అప్పగించారు. వారు ఆయన్ని అట్లాంటా జైలుకు తరలించారు. అంతకుముందు నిర్వహించిన వైద్య పరీక్షలో పటేల్ రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్నట్టు గుర్తించారు. గత శనివారం శ్వాస తీసుకోవడానికి పటేల్ ఇబ్బంది పడుతుండడంతో గ్రాడి మెమోరియాల్ దవాఖానకు తరలించారు. చికిత్సపొందుతూ ఆయన మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. ఈ విషయాన్ని భారత దౌత్యకార్యాలయ ప్రతినిధికి తెలియజేశారు. వారం రోజుల్లో ఐసీఈ కస్టడీలో మృతిచెందిన రెండో వ్యక్తి పటేల్.

198
Tags

More News