అమెరికా ఆర్థిక, వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా మనీషా సింగ్ ప్రమాణం


Sun,January 21, 2018 01:10 AM

manisha-singh
వాషింగ్టన్, జనవరి 20: భారత సంతతికి చెందిన అమెరికా న్యాయవాది మనీషా సింగ్ ఆ దేశ ఆర్థిక, వాణిజ్య వ్యవహారాలశాఖ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆమెతో శనివారం విదేశాంగశాఖ మంత్రి రెక్స్ టిల్లర్సన్ ప్రమాణం చేయించారు. ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన మనీషా సింగ్ ఇంతకుముందు అమెరికాలోని అలస్కాడాన్ సులీవాన్ సెనెటర్‌కు సీనియర్ సలహాదారుగా పని చేశారు. గతేడాది నవంబర్ రెండో తేదీన మనీషా సింగ్ నియామకాన్ని అమెరికా సెనెట్ ధ్రువీకరించింది. ఈ సందర్భంగా మనీషా సింగ్ స్పందిస్తూ అమెరికాలో భద్రతను ఆర్థిక ప్రగతిని ప్రోత్సహిస్తామని ట్వీట్ చేశారు. అమెరికా ఆర్థిక, వాణిజ్య వ్యవహారాలశాఖ సహాయ మంత్రిగా నియమితురాలైన తొలి మహిళ మనీషా సింగ్.

186

More News

VIRAL NEWS