వేదికపైనే కుప్పకూలి హాస్యనటుడు మృతి

Mon,July 22, 2019 02:04 AM

Indian comedian dies after collapsing on stage in Dubai

-ప్రదర్శనలో భాగమని నమ్మిన ప్రేక్షకులు.. దుబాయ్‌లో విషాదం
దుబాయ్‌: భారత సంతతికి చెందిన నటుడు, స్టాండప్‌ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకొన్న మంజునాథ్‌ నాయుడు (36) శుక్రవారం రాత్రి హఠాన్మరణం చెందారు. దుబాయ్‌లోని ఒక హోటల్‌లో లక్షల మంది ఎదుట ప్రదర్శన ఇస్తుండగా గుండెపోటు రావడంతో వేదికపైనే కుప్పకూలిపోయారు. ప్రదర్శనలో లీనమైన ప్రేక్షకులు, నిర్వాహకులు.. మంజునాథ్‌ కుప్పకూలిపోవడాన్ని కూడా ప్రదర్శనలో భాగమని అనుకొన్నారు. గుండెపోటుకు గురైన విషయాన్ని గుర్తించిన వెంటనే సమీపంలోని దవాఖానకు తరలించగా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. చెన్నై మూలాలున్న మంజునాథ్‌ అబుదాబిలో జన్మించారు. ఐదేండ్లుగా మంచి స్టాండప్‌ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకొన్నారు.

1651
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles