అమెరికా కోర్టు జడ్జిగా నియోమీరావు ప్రమాణం

Fri,March 22, 2019 03:04 AM

Indian American Neomi Rao sworn in as judge of powerful DC court

వాషింగ్టన్, మార్చి 21: అమెరికాలో కొలంబియా జిల్లా సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన అమెరికా న్యాయవాది నియోమీ రావు (45) ప్రమాణం చేశారు. వైట్‌హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా సుప్రీంకోర్టు జస్టిస్ క్లారెన్స్ థామస్ ఆమెతో న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నియోమీ రావు భర్త అలన్ లెఫ్కోవిట్జ్ తదితరులు హాజరయ్యారు. అమెరికా సుప్రీంకోర్టు తర్వాత కొలంబియా జిల్లా సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌ను ఆ దేశంలో శక్తిమంతమైన న్యాయస్థానంగా పరిగణిస్తారు. జస్టిస్ బ్రెట్ కవనాగ్ స్థానంలో నియోమీరావును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కు నామినేటైన రెండో వ్యక్తి నియోమీరావు. అంతకుముందు భారత సంతతికి చెందిన శ్రీనివాసన్ అనే వ్యక్తి ఆ పదవిని చేపట్టారు. భారత్‌కు చెందిన వైద్యులు జెరీన్‌రావు, జహంగీర్ నారియోషాంగ్ దంపతులకు డెట్రాయిట్‌లో నియోమీ రావు జన్మించారు.

235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles