భార్య హత్యకు ఇండియన్ అమెరికన్ కుట్ర

Fri,February 8, 2019 01:51 AM

Indian American Narsan Lingala Plotted To Kill Wife

-సహకరించిన ప్రియురాలు
-కిరాయి హంతకుడిగా వచ్చి భగ్నం చేసిన పోలీసు

వాషింగ్టన్: భారత సంతతి అమెరికన్ తన ప్రియురాలితో కలిసి మాజీ భార్యహత్యకు పన్నిన కుట్ర భగ్నమైంది. కిరాయి హంతకుడిగా పోలీసు వచ్చాడని తెలియక తన కుతంత్రాన్నంతా చెప్పి కటకటాలపాలయ్యాడు. నర్సన్ (55)కు 1995లో వివాహమైంది. వారికో కొడుకు, కూతురు ఉన్నారు. నర్సన్ 2011లో భార్య తో గొడవపడి విడిపోయాడు. ఆస్తి పంపకాల్లో ఏకాభిప్రాయం రాక విడా కుల కేసు పెండింగ్‌లో ఉంది. గతేడాది మే నెలలో వేరే కేసులో నర్సన్ మిడిల్‌సెక్స్ కౌంటీ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు మరో ఖైదీని పరిచయం చేసుకొని తన భార్య హత్యకు ఒక కిరాయి హంతకుడిని చూపెట్టమన్నాడు. నర్సన్ గత ఆగస్టులో పోలీసు కస్టడీ నుంచి బయటకొచ్చాక ప్రియురాలు సంధ్యారెడ్డి (52)తో కలిసి న్యూజెర్సీలోని ఓ షాపింగ్ మాల్ వద్ద హంతకుడిగా వచ్చిన పోలీసుతో కలిసి పథకం రచించారు. 5000-10 వేల డాలర్లకు బేరం కుదిరింది. వీరికి తెలియకుం డా సంభాషణను పోలీసు వీడియో తీశాడు. ఆ వెంటనే వారిని చుట్టుముట్టిన పోలీసులు నర్సన్‌ను, సంధ్యారెడ్డి అరెస్టు చేశారు. గురువారం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.

1461
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles