పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం: సుష్మ

Thu,September 21, 2017 01:42 AM

India will work above beyond Paris Agreement says Sushma Swaraj

sushmaswaraj
ఐక్యరాజ్యసమితి: పారిస్ పర్యావరణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని భార త్ పునరుద్ఘాటించింది. ఒప్పందానికి అనుగుణం గా పరిమితులకు లోబడి కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు పనిచేస్తామని స్పష్టంచేసింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రోన్ అధ్యక్షతన బుధవారం ఐక్యరాజ్యసమితిలో పర్యావరణ పరిరక్షణ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడారు. పర్యావరణం, అభివృద్ధిపై చర్చలకు భారత్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని చెప్పారు. భారత్, చైనాలకు అధిక ప్రయోజనం చేకూర్చేలా ఒప్పందం ఉన్నదని ఆరోపిస్తూ అమెరికా పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి తప్పుకొన్న నేపథ్యంలో సుష్మ పైవిధంగా స్పందించారు.

186

More News

VIRAL NEWS