షేర్పాగా సహకరిస్తాం


Sun,May 13, 2018 01:54 AM

నేపాల్ విజయ శిఖరాలను అధిరోహించేందుకు
-ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన
- నేపాల్ నేలను భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగపడనివ్వం: ఓలి

PMModi
కఠ్మాండు, మే 12: నేపాల్ విజయశిఖరాలను అధిరోహించేందుకు భారత్ షేర్పాగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. బుల్లెట్ల నుంచి బ్యాలెట్ వరకు నేపాల్ సాగించిన విజయవంతమైన ప్రయాణాన్ని మోదీ కొనియాడారు. రెండురోజుల నేపాల్ పర్యటనను ముగించుకున్న మోదీ శనివారం సాయంత్రం ఢిల్లీ తిరిగి వచ్చారు. అంతకుముందు ఆయన గౌరవార్ధం నేపాల్ రాజధాని కఠ్మాండులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు. నేపాల్ యుధ్ నుంచి బుధ్ (యుద్ధం నుంచి శాంతి)కి సుదీర్ఘ ప్రయాణం చేసింది. బ్యాలెట్ కోసం మీరు బుల్లెట్లను వదిలారు. కానీ ఇంకా గమ్యాన్ని చేరుకోలేదు.

ఇంకా సుదూరం వెళ్లాల్సి ఉంది అని వ్యాఖ్యానించారు. మీరు ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్‌కు మాత్రమే చేరుకున్నారు. శిఖరాన్ని అధిరోహించడం ఇంకా మిగిలే ఉంది. శిఖరాలను అధిరోహించే పర్వతారోహకులకు షేర్పాలు సహాయం అందించినట్టే.. నేపాల్ కోసం షేర్పాగా మారేందుకు భారత్ సిద్ధంగా ఉంది అని సభికుల హర్షధ్వానాల మధ్య మోదీ ప్రకటించారు. నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి, ఉపాధ్యక్షుడు నందా బహదూర్ పన్, మాజీ ప్రధానులు ప్రచండ, షేర్ బహదూర్ దేవ్‌బా, ఇతర ప్రతిపక్ష నేతలను మోదీ కలుసుకున్నారు. తన నేపాల్ పర్యటన చారిత్రాత్మకమని, చర్చలు ఫలవంతమయ్యాయని మోదీ ట్వీట్ చేశారు. భారత్ ప్రయోజనాలు నేపాల్‌కు ముఖ్యమైనవని, తమ భూభాగాన్ని భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగపడనివ్వబోమని ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి పేర్కొన్నారు.

442

More News

VIRAL NEWS