భారత్ అణు సామగ్రిని దుర్వినియోగం చేస్తున్నది: పాక్

Sat,May 20, 2017 01:13 AM

-2600 అణ్వాయుధాలు తయారు చేయగలిగే సామర్థ్యం భారత్ సొంతం
ఇస్లామాబాద్, మే 19: భారత్‌పై పాక్ మరోసారి తన వాచాలత్వాన్ని బయటపెట్టింది. శాంతియుత అవసరాల కోసం అణు సామగ్రిని దిగుమతి చేసుకుంటున్న భారత్ వాటిని దుర్వినియోగం చేస్తూ అణ్వాయుధాలను తయారు చేస్తున్నదని ఆరోపించింది. పాకిస్థాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ఆరోపణలు చేశారు. అణు సామగ్రిని భారత్ దుర్వినియోగం చేయడం ద్వారా ఏర్పడుతున్న ప్రమాదాన్ని దశాబ్దాలుగా పాక్ ప్రపంచానికి వివరిస్తూనే ఉన్నదని పేర్కొన్నారు. ఇండియా అణ్వాయుధ కార్యక్రమం ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్నదని ఆరోపించారు. ఇటీవల విడుదలైన హార్వర్డ్ కెన్నెడీ స్కూల్, బెల్ఫెర్ నివేదికలు భారత అణు ఇంధన మళ్లింపు కార్యక్రమాన్ని బలపరుస్తున్నాయని జకారియా వివరించారు. 2600 అణ్వాయుధాలు తయారు చేయగలిగినంత అణు సామగ్రి ఉన్నదని బెల్ఫెర్ పేపర్ పేర్కొందని తెలిపారు.

245

More News